'రాజుగారి గది 3'లో అవికా గోర్
- ఓంకార్ నుంచి 'రాజుగారి గది 3'
- రెగ్యులర్ షూటింగుకి సన్నాహాలు
- త్వరలోనే మిగతా వివరాలు
ఈ సినిమా నుంచి తమన్నా తప్పుకోవడంతో, తాప్సీని తీసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అవికా గోర్ పేరు తెరపైకి వచ్చింది. తెలుగులో వరుస విజయాలను అందుకున్న అవికా గోర్, ఆ తరువాత గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే 'రాజుగారి గది 3'లో అవికాను ప్రధాన పాత్రకోసం తీసుకున్నారా? లేదంటే కీలకమైన మరో పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారా? అనేది తెలియాల్సి వుంది.