సమంత జీవితం ఒక సక్సెస్ స్టోరీ!: కంగన సోదరి ప్రశంసలు
- ‘ఓ బేబీ’ అద్భుతమైన విజయం సాధించింది
- సమంత అసలు సిసలైన ఫెమినిస్ట్
- తనకంటూ సొంత గుర్తింపును సంపాదించుకుందన్న రంగోలి
‘ఓ బేబీ’ అద్భుతమైన విజయాన్ని అందుకుందని, సమంత అసలు సిసలైన స్త్రీవాది అని రంగోలి పేర్కొంది. సామ్ జీవితం ఓ విజయవంతమైన కథ అని, ఓ గొప్ప కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండి కూడా తనకంటూ సొంత గుర్తింపును సమంత సంపాదించుకుందని రంగోలి పేర్కొంది. సమంత వంటి దేవతల్ని తాము ప్రశంసిస్తామని, కంగన బృందం నుంచి ఆల్ ది బెస్ట్ చెబుతూ రంగోలి ట్వీట్ చేసింది. ఇది చూసిన సమంత స్పందిస్తూ, ఎంతో ప్రేమ కురిపించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రంగోలీకి సమాధానమిచ్చింది.