సంక్రాంతి బరిలోకి దిగుతున్న శర్వానంద్
- సెట్స్ పై '96' మూవీ రీమేక్
- తదుపరి సినిమా కొత్త దర్శకుడితో
- త్వరలో కథానాయిక పేరు ప్రకటన
సుకుమార్ క్లాప్ తో ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలైంది. అయితే శర్వానంద్ ఒక నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న తరువాతనే షూటింగులో జాయిన్ అవుతాడు. ఈ లోగా మిగతా ఆర్టిస్టుల కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. త్వరలోనే కథానాయిక పేరును ప్రకటించనున్నారు. రామ్ ఆచంట - గోపీనాథ్ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఆల్రెడీ బాలకృష్ణ .. నాగార్జున .. మహేశ్ బాబు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.