నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన ఛాన్స్ కొట్టేసిన తమన్నా
- తెలుగు .. తమిళ భాషల్లో తమన్నాకి క్రేజ్
- మౌనీ రాయ్ ప్లేస్ లో తమన్నాకి అవకాశం
- ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్న తమన్నా
అప్పటి నుంచి కూడా ఆమె సరైన హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకి నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన అవకాశం లభించింది. నవాజుద్దీన్ కథానాయకుడిగా షామాన్ సిద్ధిఖీ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా ముందుగా ఆయన మౌనీ రాయ్ ను ఎంపిక చేసుకున్నాడు. అయితే కొన్ని కారణాల వలన ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో, తమన్నాను తీసుకున్నాడు. ఈ ప్రాజెక్టులో ఛాన్స్ దక్కడం పట్ల తమన్నా ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. కథాకథనాలు తనకి బాగా నచ్చాయనీ, సెట్లోకి ఎప్పుడు అడుగుపెడతానా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది.