బీజేపీ రాజకీయ వ్యాపారంలోకి దిగలేదు: మురళీధర్ రావు
- రాజకీయాలను వ్యాపారంగా బీజేపీ ఆలోచించదు
- టీడీపీలో అంతర్మథనం ప్రారంభమైంది
- బీజేపీలోకి ఇతర పార్టీల నాయకులు రావడం వల్ల మా సిద్ధాంతాలేమీ మారవు
బీజేపీలోకి ఇతర పార్టీల నాయకులు రావడం వల్ల తమ పార్టీ మలినం అయిపోయిందని, ఏదో మార్పు వచ్చిందనడం కరెక్టు కాదని అన్నారు. ఇతర పార్టీల నాయకులు తమ పార్టీలో చేరడం ద్వారా బీజేపీ సిద్ధాంతాలేమీ మారవని, ‘బీజేపీ డీఎన్ఏ’ ను మార్చిన ఘటనలు లేవని అన్నారు. బీజేపీ బలోపేతం చేస్తారే తప్ప, పార్టీ దిశను మారుస్తారన్న అనుమానాలు అక్కర్లేదని స్పష్టం చేశారు.