హైదరాబాద్ లో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను: హీరోయిన్ నివేదా థామస్
- రేపు థియేటర్లకు రానున్న 'బ్రోచేవారెవరురా'
- బంధాలు .. అనుబంధాల నేపథ్యంలో సాగే కథ
- నా పాత్ర నచ్చుతుందన్న నివేదా థామస్
తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. " బంధాలు .. భావోద్వేగాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో నా పాత్ర ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. తెలుగులో బిజీ అవుతున్న కారణంగా తమిళ .. మలయాళ సినిమాల సంఖ్యను తగ్గించాను. హైదరాబాదులో ఇల్లు తీసుకోవాలనే ఆలోచనలో వున్నాను. త్వరలోనే ఆ పని పూర్తవడం .. నేను ఇక్కడికి షిఫ్ట్ కావడం జరిగిపోతాయి" అని చెప్పుకొచ్చింది.