ఇది డిఫరెంట్ మూవీ .. హిట్ కొట్టడం ఖాయం: ఆది సాయికుమార్
- ఇది రెండు బుర్రల కథ
- హీరో ఒకడే .. ఇద్దరిలా కనిపిస్తాడు
- ఆడియన్స్ కి కొత్తగా అనిపిస్తుందన్న ఆది
ఈ సందర్భంగా ఆది సాయికుమార్ మాట్లాడుతూ .. "ఇది రెండు బుర్రల కథ .. ద్విపాత్రాభినయం కాదు .. హీరో ఒకడే .. కాకపోతే ఇద్దరిగా కనిపిస్తాడు" అని చెప్పాడు. "డైమండ్ రత్నబాబుగారు కథ చెప్పగానే చాలా ఇంట్రెస్టింగ్ గా .. డిఫరెంట్ గా అనిపించింది. ఒకే మనిషిలో రెండు బ్రెయిన్స్ ఉంటాయి. ఒకటి ఒకలా .. ఇంకొకటి మరొకలా ఆలోచిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది కథ. వైవిధ్యభరితమైన ఈ కథ ఆడియన్స్ కి నచ్చుతుందనీ .. హిట్ కొడుతుందని అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.