సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- సినిమా చూడమంటూ కాజల్ సలహా
- చిరంజీవి 'సైరా' షూటింగ్ పూర్తి
- మహేశ్ సినిమా శాటిలైట్ హక్కులు
* చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం సైరా షూటింగ్ మొత్తం నిన్నటితో పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న భారీ ఎత్తున రిలీజ్ చేస్తారు.
* మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందే 'సరిలేరు నీకెవ్వరూ' చిత్రానికి ఇంకా షూటింగ్ మొదలు కాకుండానే బిజినెస్ వర్గాలలో క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఈ చిత్రం శాటిలైట్ హక్కులను జెమిని టీవీ భారీ రేటు ఆఫర్ చేసి సొంతం చేసుకున్నట్టు సమాచారం.