మహిళను తలపై మోది హత్య చేసిన దుండగులు.. తల్లి శవం పక్కనే పసికందు!
- భర్త ఆఫీసుకు వెళ్లిన సమయంలో హత్య
- సింతన్‌ను తలపై మోది హత్య చేసిన దుండగులు
- రాత్రి 8 గంటలకు వచ్చి ఘటనను చూసిన భర్త
రాత్రి 8 గంటలకు భర్త ఇంటికి వచ్చి చూసే సరికి విగత జీవిగా భార్య, ఆ పక్కనే తన ఆరు నెలల పసిపాప ఉండటం చూసి తీవ్రంగా కలత చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు విచారణ నిర్వహిస్తున్నారు.