ఆసక్తిని పెంచుతోన్న 'అక్షర' టీజర్
- తెలుగు తెరపైకి మరో హారర్ థ్రిల్లర్
- టీచర్ పాత్రలో నందిత శ్వేత
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
అజయ్ ఘోష్ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలైంది. అక్షరపై మనసు పారేసుకున్న అజయ్ ఘోష్ .. షకలక శంకర్ .. సత్య .. మధునందన్ ల చుట్టూ ఈ కథ తిరుగుతుందనే విషయం ఈ టీజర్ ను బట్టి అర్థమవుతోంది. ఆమెను చంపేయాలనే ఉద్దేశంతో కిడ్నాప్ చేస్తారు. ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలపై ఆసక్తిని పెంచుతూ టీజర్ ను కట్ చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.