'డియర్ కామ్రేడ్' నుంచి మనసును దోచే పాట
- మరోసారి విజయ్ దేవరకొండ జోడీగా రష్మిక
- సంగీత దర్శకుడిగా జస్టిన్ ప్రభాకరన్
- వచ్చేనెల 26వ తేదీన విడుదల
తాజాగా ఈ సినిమా నుంచి మూడో లిరికల్ వీడియో సాంగును విడుదల చేశారు. "గిర గిర గిర తిరగలిలాగా .. తిరిగి అరిగిపోయినా దినుసే నలగాలేదుగా .., అలుపెరుగక తన వెనకాలే అలసి సొలసి పోయినా మనసే కరుగ లేదులే" అంటూ ఈ పాట సాగుతోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం .. రెహ్మాన్ సాహిత్యం .. గౌతమ్ భరద్వాజ్ - యామినీ ఘంటసాల ఆలాపన మనసుకు పట్టేలా వున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మెలోడియస్ సాంగ్స్ లో ఇదొకటని చెప్పొచ్చు. వచ్చేనెల 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.