20 నుంచి 24 వరకూ విజయవాడ దుర్గ గుడిలో వరుణయాగం
- 20 - 22 వరకూ అర్చకుల పారాయణం
- 23న ఉదయం మండప ఆరాధనలు
- 24న ఉదయం సహస్ర ఘటాభిషేకం
యాగానికి సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు. ఈ నెల 20 నుంచి 24 వరకూ నిర్వహించతలపెట్టిన వరుణయాగంలో 20 - 22 వరకూ ఉదయం 6 - 8 గంటల వరకూ దేవస్థానానికి చెందిన అర్చకులు పారాయణం నిర్వహించనున్నారు. 23న ఉదయం 7-11 గంటల వరకూ మండప ఆరాధనలుంటాయని, 24న ఉదయం 6-11 వరకూ సహస్ర ఘటాభిషేకం జరుగుతుందని కోటేశ్వరమ్మ తెలిపారు.