సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- కొత్తగా ట్రై చేసే కథానాయిక
- వచ్చే నెల నుంచి బాలకృష్ణ సినిమా
- గోపీచంద్ సినిమాలో కామెడీ స్టార్
* బాలకృష్ణ కథానాయకుడుగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందే చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచి షూటింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క, ఇందులో ఓ హీరోయిన్ గా శ్రియాను ఎంపిక చేశారు.
* గోపీచంద్ హీరోగా తిరు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'చాణక్య' చిత్రంలో ప్రముఖ హాస్యనటుడు సునీల్ ఓ కీలక పాత్ర పోషించనున్నాడు. సునీల్ పాత్ర సినిమా మొత్తం సాగుతూ నవ్వులు పూయిస్తుందని తెలుస్తోంది.