టీవీ నటి రాగ మాధురిపై దాడి!
- రాగమాధురిపై హెయిర్ డ్రెసర్ జ్యోతిక దాడి
- బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేసిన రాగమాధురి
- జ్యోతిక, ఆమె అనుచరులపై కేసు నమోదు
ఈ ఫిర్యాదు మేరకు జ్యోతికను విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో పోయిన గొలుసు కారులో దొరికిందంటూ సెట్ లోని వారు ఆ గొలుసును పోలీసులకు అప్పగించి పోలీస్ స్టేషన్ నుంచి జ్యోతికను తీసుకెళ్లారు.ఈ ఘటనతో ఆగ్రహం చెందిన జ్యోతిక, తన అనుచరులు ఎనిమిది మందితో కలిసి షూటింగ్ జరుగుతున్న ప్రదేశం వద్దకు వెళ్లి రాగమాధురిపై దాడికి పాల్పడింది. తనపై దాడి నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులకు రాగమాధురి మరోమారు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు జ్యోతిక, ఆమె అనుచరులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.