సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- స్పెయిన్ లో కీర్తి సురేశ్ షూటింగ్
- డబ్బింగ్ మొదలెట్టిన చిరంజీవి
- 'ఇస్మార్ట్ శంకర్' పాటల చిత్రీకరణ
* మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రం టాకీ పార్ట్ పూర్తయింది. దీంతో ఈ చిత్రం డబ్బింగ్ మొదలైంది. నిన్నటి నుంచి హైదరాబాదు, శబ్దాలయ థియేటర్ లో చిరంజీవి తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు.
* రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇస్మార్ట్ శంకర్' చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ మాల్దీవులలో ముగిసింది. అక్కడ రెండు పాటలను చిత్రీకరించామని చిత్ర నిర్మాత చార్మి పేర్కొంది.