కేంద్రమంత్రి చూస్తుండగానే చిన్నారి మృత్యువాత... బీహార్ లో ప్రబలిన మెదడువాపు
- బీహార్ లో ఇప్పటివరకు 82 మంది మృతి
- పరిస్థితి సమీక్షించేందుకు వచ్చిన కేంద్రమంత్రి హర్షవర్ధన్
- చిన్నారి మృతితో చలించిపోయిన వైనం
పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్రమంత్రి హర్షవర్ధన్ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన ఒక్కో చిన్నారిని పరామర్శించుకుంటూ వెళుతుండగా, ఓ బెడ్ పై ఉన్న చిన్నారి నరకయాతన పడుతూ మంత్రి కళ్లెదురుగానే ప్రాణాలు విడిచాడు. ఈ పరిణామంతో కేంద్రమంత్రి తీవ్రంగా చలించిపోయారు. బీహార్ లో నిత్యం పదుల సంఖ్యలో పిల్లలు మృత్యువాత పడుతుండడం నితీశ్ కుమార్ సర్కారును కలచివేస్తోంది. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు.