మొత్తానికి శ్రుతి హాసనే ఖరారైపోయింది!
- రవితేజతో గోపీచంద్ మలినేని
- నిర్మాతగా ఠాగూర్ మధు
- త్వరలోనే సెట్స్ పైకి
రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం శ్రుతి హాసన్ ను సంప్రదించారు. భారీ పారితోషికాన్ని ఆమె డిమాండ్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. చాలాసార్లు బేరసారాలు జరిగిన అనంతరం శ్రుతి దిగొచ్చిందట. అందువలన ఆమెనే ఫిక్స్ చేశారనేది తాజా సమాచారం. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.