'చాణక్య' సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్
- ఈ రోజు గోపీచంద్ పుట్టినరోజు
- కీలకమైన పాత్రలో జరీన్ ఖాన్
- ముగింపు దశకి చేరుకున్న చిత్రీకరణ
ఈ రోజున గోపీచంద్ పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'చాణక్య' సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. ప్రతీకారం తీర్చుకోవడం కోసం రంగంలోకి దిగిన కథానాయకుడు, ఆ పనిలో నిమగ్నమైనట్టుగా ఈ పోస్టర్ లో గోపీచంద్ కనిపిస్తున్నాడు. గోపీచంద్ డిఫరెంట్ లుక్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో గోపీచంద్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.