పూరీ జగన్నాథ్ కు బెదిరింపులు.. నిందితుడి అరెస్ట్!
- మురళీ కృష్ణ అనే వ్యక్తి వద్ద 'ఇస్మార్ట్ శంకర్' స్క్రిప్ట్
- డబ్బివ్వకుంటే ఆన్ లైన్లో పెడతానని బెదిరింపులు
- గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసిన పోలీసులు
కాగా, పూరీ ఫిర్యాదుపై అలర్ట్ అయిన సైబర్ క్రైమ్ విభాగం, సదరు వ్యక్తిని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసి విచారించినట్టు తెలుస్తోంది. తాను కూడా మరో వెబ్ సైట్ నుంచి స్క్రిప్ట్ ను పొందానని, తానేమీ డబ్బు డిమాండ్ చేయలేదని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. పూరీ ఫిర్యాదుపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.