సునీల్ వైపే మొగ్గుచూపిన రవితేజ
- రవితేజ హీరోగా 'డిస్కోరాజా'
- నాయికలుగా పాయల్ - నభా
- 'అల్లరి' నరేశ్ లేనట్టే
'మహర్షి' లో 'అల్లరి' నరేశ్ పాత్రకి వచ్చిన రెస్పాన్స్ చూసిన ఆనంద్, సునీల్ స్థానంలో 'అల్లరి' నరేశ్ ను తీసుకోవాలనే ఆలోచన చేశాడట. అయితే సునీల్ కి .. రవితేజకి మంచి స్నేహం వుంది. అందువలన సునీల్ ను తప్పించడానికి రవితేజ అంగీకరించలేదట. ఇక సునీల్ .. 'అల్లరి' నరేశ్ కూడా మంచి స్నేహితులు, అందువలన సునీల్ స్థానంలో చేయమంటే 'అల్లరి' నరేశ్ ఒప్పుకోవడం కష్టం. అందువల్లనే సునీల్ తో కంటిన్యూ చేయడానికే ఆనంద్ సిద్ధమయ్యాడని చెప్పుకుంటున్నారు.