ఇద్దరు స్టార్ హీరోలపై 'పెళ్లి' పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు
- అజిత్ కి ఇతర వ్యాపకాలపై ఆసక్తి ఎక్కువ
- పొగడ్తలను అజిత్ పెద్దగా పట్టించుకోరు
- సూర్య బయట కూడా పవర్ఫుల్
"అజిత్ చాలా కూల్ గా కనిపిస్తారు .. ఎవరితో ఎలా ఉండాలనేది ఆయనకి బాగా తెలుసు. షాట్ రెడీ అన్నప్పటికీ ఆయన పెద్దగా పట్టించుకోరు. అలాగే తనని పొగిడినప్పుడు కూడా పెద్దగా స్పందించరు. ఆయనకి నటనపై కంటే, వంటచేయడం వంటి ఇతర వ్యాపకాలపైనే ఆసక్తి ఎక్కువ. అలాంటి ఆయనకి ఇంతటి స్టార్ డమ్ ఎలా వచ్చిందనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు.
ఇక సూర్య విషయానికొస్తే, సినిమాల్లో ఆయన ఎంత పవర్ఫుల్ గా కనిపిస్తారో .. బయట కూడా అలాగే ఉంటారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆయన పిరియడ్ ముగిసినట్టుగా అనిపిస్తోంది" అని అన్నారు. దాంతో పృథ్వీరాజ్ పై ఈ ఇద్దరి స్టార్ హీరోల అభిమానులు ఫైర్ అవుతున్నారు.