విజయ్ దేవరకొండ ఇలా చేశాడేంటబ్బా?
- రీసెంట్ గా వచ్చిన 'దొరసాని' ట్రైలర్
- ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ పరిచయం
- విజయ్ దేవరకొండ తీరుపై ఫ్యాన్స్ అసహనం
ఈ ట్రైలర్ గురించి విజయ్ దేవరకొండ ఎంతమాత్రం స్పందించలేదు. ఆ తరువాత 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' సినిమా నుంచి ట్రైలర్ వచ్చింది. ఈ ట్రైలర్ పై విజయ్ దేవరకొండ వెంటనే స్పందించాడు .. షేర్ చేశాడు. దాంతో తమ్ముడి సినిమా ట్రైలర్ విషయంలో సైలెంట్ గా వుండిపోయి, వేరే వారి సినిమాను మోసే పనులేంటని ఫ్యాన్స్ ఆయనకి క్లాస్ తీసుకుంటున్నారు. ఈ విషయంపై విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తాడో చూడాలిమరి.