'బంగారు బుల్లోడు'గా కనిపించనున్న యాక్షన్ హీరో
- తిరు దర్శకత్వంలో గోపీచంద్
- 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి
- గోపీచంద్ సరసన ఇద్దరు హీరోయిన్లు
ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాకి 'బంగారు బుల్లోడు' టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయనున్నారని అంటున్నారు. తనను ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవడం కోసం కథానాయకుడు ఎలాంటి సాహసాలు చేశాడనే కథాంశంతో ఈ సినిమా నిర్మితమవుతోందట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు గోపీచంద్ సరసన అలరించనున్నట్టుగా సమాచారం