మరో హారర్ కామెడీ మూవీలో తమన్నా
- తెలుగులో హిట్ కొట్టిన 'ఆనందో బ్రహ్మ'
- తమిళంలో రీమేక్ దిశగా సన్నాహాలు
- తాప్సీ పాత్రలో తమన్నా
ఆ మధ్య తెలుగులో 'ఆనందో బ్రహ్మ' అనే హారర్ కామెడీ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తాప్సీ ప్రధానమైన పాత్రను పోషించింది. ఇప్పుడు ఇదే సినిమాను తమిళంలో రీమేక్ చేస్తుండగా .. తాప్సీ పాత్రలో తమన్నా కనిపించనుంది. రోహిన్ వెంకటేశన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. తెలుగులో హిట్ అయిన ఈ హారర్ కామెడీ, తమిళంలో తమన్నాకి హిట్ ఇస్తుందేమో చూడాలి.