నితిన్ జోడీగా ఛాన్స్ కొట్టేసిన ప్రియా వారియర్?
- ప్రియా వారియర్ కి యూత్ లో క్రేజ్
- కలిసిరాని తొలిప్రయత్నం
- చంద్రశేఖర్ యేలేటి సినిమాలో ఛాన్స్
నితిన్ కథానాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయికగా ప్రియా వారియర్ ను తీసుకున్నారని అంటున్నారు. 'మనమంతా' తరువాత చంద్రశేఖర్ యేలేటి నుంచి రానున్న సినిమా ఇదే. నితిన్ 'భీష్మ' పూర్తయిన తరువాత, చంద్రశేఖర్ యేలేటి ప్రాజెక్టుకి సంబంధించిన క్లారిటీ రానుంది.