ఊపందుకున్న రవితేజ 'డిస్కోరాజా'
- రవితేజ హీరోగా 'డిస్కోరాజా'
- నాయికలుగా పాయల్ - నభా
- వికారాబాద్ లో షూటింగు
రెండవ షెడ్యూల్లో భాగంగా కొన్ని రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో రవితేజ - వెన్నెల కిషోర్ కాంబినేషన్లోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ రోజు .. రేపు వికారాబాద్ లో షూటింగును ప్లాన్ చేశారు. కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో మరో కథానాయికకు కూడా చోటు వున్నట్టుగా తెలుస్తోంది.