హీటెక్కిన సోషల్ మీడియా వార్... విజయ్ దేవరకొండపై 'ఫలక్ నుమా దాస్' హీరో విశ్వక్ ఆగ్రహం!
- ఇటీవల విడుదలైన 'ఫలక్ నుమా దాస్'
- సినిమా బాగాలేదంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కామెంట్లు
- మండిపడుతున్న విశ్వక్
ఇక తన సినిమాకు అడ్డంకులు సృష్టించాలని చూస్తే, చూస్తూ ఊరుకునేది లేదని, తన అభిమానుల కామెంట్ల వెనుక విజయ్ దేవరకొండ ఉన్నాడని విశ్వక్ ఆరోపిస్తున్నారు. తన అభిమానులను విజయ్ కంట్రోల్ చేయాలని డిమాండ్ చేశాడు. తాను హైదరాబాద్ కు రానున్నానని, వచ్చిన వెంటనే మీడియా సమావేశం పెట్టి, అందరికీ సమాధానం ఇస్తానని చెబుతూ విశ్వక్, ఓ వీడియోను తీసి సోషల్ మీడియాలో విడుదల చేశాడు. తాను హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించి, సక్సెస్ మీట్ ను పెట్టనున్నానని స్పష్టం చేశాడు.