చిరూ పుట్టిన రోజునే కొరటాల సినిమా లాంచ్
- ముగింపు దశలో 'సైరా'
- అక్టోబర్ 2వ తేదీన విడుదల
- కొరటాల ప్రాజెక్టు పట్టాలపైకి
ఈ సినిమా తరువాత చిరంజీవి .. కొరటాల శివతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయాలనే ఆలోచనలో కొరటాల శివ వున్నారు. సినిమా లాంచ్ తరువాత ఒకటి రెండు రోజుల గ్యాప్ తీసుకుని, రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. సామాజికపరమైన కథాంశంతో .. సందేశంతో ఈ సినిమా వుంటుందని అంటున్నారు. ఎన్నారైగాను .. రైతుగాను రెండు విభిన్నమైన పాత్రల్లో చిరంజీవి కనిపించనున్నారని చెబుతున్నారు.