మరో ప్రేమకథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
- వరుస సినిమాలతో విజయ్ దేవరకొండ బిజీ
- సెట్స్ పై రెండు ప్రాజెక్టులు
- లైన్లో హను రాఘవపూడి
కథ నచ్చేసిందని విజయ్ దేవరకొండ చెప్పడంతో, పూర్తిస్థాయి స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో హను రాఘవపూడి వున్నాడని అంటున్నారు. మిలటరీ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం క్రాంతిమాధవ్ .. ఆనంద్ అన్నామలై ప్రాజెక్టులతో విజయ్ దేవరకొండ బిజీగా వున్నాడు. ఆ రెండు ప్రాజెక్టులు ఒక దారికి వచ్చిన తరువాత ఆయన హను రాఘవపూడితో కలిసి సెట్స్ పైకి వెళతాడని అంటున్నారు.