విషం తాగిన మహిళకు వైద్యులు చికిత్సనందించే క్రమంలో నోట్లో పేలుడు.. మృతి
- నోట్లోకి పైపు పంపించిన వైద్యులు
- సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఘటన
- పేలుడుకి కారణం వివరించిన వైద్యులు
ఇంతలో అనూహ్యంగా ఆమె నోట్లో పేలుడు సంభవించింది. దీంతో మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఆపరేషన్ థియేటర్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ ఘటనపై వైద్యులు మాట్లాడుతూ, మహిళ సల్ఫ్యూరిక్ ఆమ్లం తాగిందని, నోట్లోని పైపులో ఉన్న ఆక్సిజన్‌తో రసాయనిక చర్య జరిగి చిన్నపాటి పేలుడు సంభవించిందని వివరణ ఇచ్చారు. ఆసుపత్రి ప్రతినిధి మాట్లాడుతూ, ఘటనపై విచారణ జరుపుతున్నామని, అసలు కారణాలేంటో త్వరలో తేలుస్తామన్నారు.