బాలయ్యను కలవాలని నిర్ణయించుకున్న బోయపాటి!
- కెఎస్. రవికుమార్ తో బాలకృష్ణ
- పెద్ద బ్యానర్ నుంచి బోయపాటికి ఆఫర్
- బాలయ్యతో ఓ మాట చెప్పేందుకు సిద్ధం
పెద్ద బ్యానర్లో ఒక స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ బోయపాటికి వచ్చిందట. బాలకృష్ణకి ఒక మాట చెప్పేసి, తన తాజా ప్రాజెక్టును మొదలుపెట్టాలనే ఉద్దేశంతో బోయపాటి వున్నాడని అంటున్నారు. అవకాశం వచ్చేసింది కదా అని వేరే ప్రాజెక్టును మొదలెట్టేస్తే, బాలకృష్ణతో వున్న అనుబంధం దెబ్బతింటుందని భావించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని చెబుతున్నారు. బాలకృష్ణను కలవడం వలన ఆ తరువాత సినిమా అయినా తనతో వుందో లేదో అనే విషయంలో బోయపాటికి క్లారిటీ వచ్చేస్తుందన్న మాట.