ఆ కథనం తెలంగాణ ప్రభుత్వానికి నచ్చలేదు.. అందుకే నన్ను టార్గెట్ చేసింది!- టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్
- ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై కథనం ప్రభుత్వానికి నచ్చలేదు
- నన్ను టార్గెట్ చేయడం వెనుక రాజకీయ, వ్యాపార అజెండా ఉంది
- విద్యార్థుల ఆత్మహత్యలను చూసీచూడనట్టు వ్యవహరించాలా?
తనను టార్గెట్ చేయడం వెనుక ఒక స్పష్టమైన రాజకీయ, వ్యాపార అజెండా ఉందని రవిప్రకాశ్ తెలిపారు. వాస్తవానికి ఆ లైవ్ షోను ప్రసారం చేసే సమయంలో కూడా తాను ప్రభుత్వం గురించి ప్రస్తావించలేదని, కేవలం వ్యవస్థ వైఫల్యం గురించే ప్రశ్నించానని చెప్పారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే తామంతా ప్రశ్నించకుండా... చూసీచూడనట్టు వ్యవహరించాలా? అని రవిప్రకాశ్ మండిపడ్డారు.