యూత్ హృదయాలు కొల్లగొట్టేసే 'డియర్ కామ్రేడ్' సెకండ్ సింగిల్
- విజయ్ దేవరకొండ హీరోగా 'డియర్ కామ్రేడ్'
- సంగీత దర్శకుడిగా జస్టిన్ ప్రభాకరన్
- యూత్ ను ఆకట్టుకునే ట్యూన్
జస్టిన్ ప్రభాకరన్ సంగీతం .. రెహ్మాన్ సాహిత్యం .. సిద్ శ్రీరామ్ - ఐశ్వర్య రవిచంద్రన్ ఆలాపన యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. జస్టిన్ ప్రభాకరన్ స్వరపరిచిన బాణీ అద్భుతంగా వుంది. ప్రేమగీతాల్లో ఉండవలసిన ఫీల్ ను ఆయన చాలా అందంగా ఆవిష్కరించారు. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మెలోడియస్ గీతాల్లో ఈ పాట చేరిపోతుందని చెప్పొచ్చు. అనుభవాలు .. జ్ఞాపకాలు .. ఆలోచనలు కలబోసిన అందమైన విజువల్స్ తో ఈ సెకండ్ సింగిల్ మనసుకు పట్టేస్తోంది. 'గీత గోవిందం' తరువాత విజయ్ దేవరకొండ .. రష్మిక జంట మరో హిట్ కొట్టేలానే కనిపిస్తోంది