దుమ్మురేపేస్తోన్న 'ఇస్మార్ట్ శంకర్' టీజర్
- పూరి నుంచి 'ఇస్మార్ట్ శంకర్'
- యాక్షన్ దృశ్యాలతో వదిలిన టీజర్
- మాస్ లీడర్ గా రామ్ దూకుడు
ఒక రకంగా ఇది రామ్ పాత్రపైనే ఫోకస్ చేస్తూ వదిలిన టీజర్ గా చెప్పుకోవాలి. మాస్ ఏరియాలో దాదాగిరి చేసే మాస్ లీడర్ శంకర్ గా ఈ సినిమాలో రామ్ కనిపిస్తాడనే విషయాన్ని ఈ టీజర్ మరోసారి స్పష్టం చేసింది. చాక్ లెట్ బాయ్ వంటి రామ్ ను మాస్ లుక్ తో చూడటం కొత్తగానే అనిపిస్తుంది. "నాతో కిరికిరంటే పోశమ్మ గుడి ముంగట పొట్టేలును గట్టేసినట్టే" అంటూ రామ్ చెప్పిన డైలాగ్, మాస్ వర్గాన్ని ఆకట్టుకునేలా వుంది