అప్పట్లో జయచిత్రకి, నాకు గొడవ జరిగినట్టుగా రాశారు: జయసుధ
- మేమంతా చాలా స్నేహంగా ఉంటాము
- మా మధ్య ఎలాంటి ఈగోస్ వుండవు
- ఆ మాత్రానికే గొడవైందని రాశారు
మా తరం హీరోయిన్స్ కి ఈగో అనేది తెలియదు. మా మధ్య ఈగోస్ వున్నట్టుగా అప్పట్లో ఒక వార్త కూడా వచ్చింది. ఒకసారి అవుట్ డోర్ లో షూటింగ్ జరుగుతోంది. జయచిత్రగారు నాకంటే కొంచెం హైట్ తక్కువ. తాను హైహీల్స్ వేసుకుంది .. నేనూ హైహీల్స్ వేసుకున్నాను. తను పొట్టిగా కనిపిస్తున్నానని చెప్పేసి, నన్ను చెప్పులు తీసేయమని అంది. నేను మరో చెప్పుల జత తెచ్చుకోలేదు .. అందువలన నేను తీయనని చెప్పాను. అంతే, మా ఇద్దరికీ గొడవైపోయిందంటూ చాలా రకాలుగా రాశారు" అని చెప్పుకొచ్చారు.