'డిస్కోరాజా' ఆగిపోయిందనేది పుకారే!
- 'డిస్కోరాజా'గా రవితేజ
- ఈ నెల 27 నుంచి రెండవ షెడ్యూల్
- కథానాయికలుగా పాయల్ - నభా
తాజాగా ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు ఖండించారు. ఈ సినిమా షూటింగు ఆగిపోలేదనే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ నెల 27వ తేదీ నుంచి రెండవ షెడ్యూల్ మొదలవుతుందనే విషయాన్ని తెలియజేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. ఈ నెల 27 నుంచి జూన్ 21వ తేదీ వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగు జరపనున్నట్టుగా చెప్పారు. రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్ .. నభా నటేశ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.