ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'బుర్రకథ' టీజర్
- ఆది సాయికుమార్ తాజా చిత్రంగా 'బుర్రకథ'
- దర్శకుడిగా డైమండ్ రత్నబాబు పరిచయం
- కథానాయికగా మిస్తీ చక్రవర్తి
ఒక బ్రెయిన్ ఒకలా .. మరో బ్రెయిన్ ఒకలా పనిచేస్తూ ఉంటాయి. దాంతో ఆయన అలవాట్లలోను .. అభిరుచుల్లోను వెంటవెంటనే వేరియేషన్స్ కనిపిస్తూ వుంటాయి. ఈ సమస్య కారణంగా హీరో ఎలాంటి ప్రమాదంలో పడతాడు? ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడతాడు? అనే కథాంశంతో ఈ సినిమా సాగనుంది. ఈ మధ్యలోనే కావాల్సినంత కామెడీని పండించారనే విషయం అర్థమవుతోంది. ఈ సినిమా అయినా ఆది సాయికుమార్ కి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.