తెలంగాణలో సాయంత్రం 5 తర్వాత లక్షల్లో ఓట్లు పడ్డాయి.. వెంటనే విచారణ జరిపించండి!: ఈసీకి టీకాంగ్రెస్ నేతల ఫిర్యాదు
- ఈసీని కలిసిన రేణుక, మర్రి, నిరంజన్
- ఖమ్మంలో ఘనవిజయం సాధిస్తానన్న రేణుక
- చేవెళ్లలో పోలింగ్ 5 శాతం తగ్గడంపై విస్మయం
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా సాయంత్రం 5 గంటల తర్వాత భారీ పోలింగ్ నమోదయిందని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. సాయంత్రం తర్వాత లక్షల సంఖ్యలో ఓట్లు పోలయ్యాయని వ్యాఖ్యానించారు. నిజామాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, హైదరాబాద్‌లలో ఐదు గంటల తర్వాత లక్షల ఓట్లు పోలింగ్ కావడంపై తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు.
కానీ ఇదే సమయంలో చేవెళ్లలో మాత్రం పోలింగ్ శాతం గతంలో కంటే 5 శాతం తగ్గిందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలనీ, సాయంత్రం 5 గంటల తర్వాత క్యూలైన్లలో ఉన్న ఎంత మందికి కాల్ చిట్టీలు ఇచ్చారో రికార్డులను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.