'డిస్కో రాజా' నిర్మాతతో రవితేజకి విభేదాలు?
- రవితేజ హీరోగా 'డిస్కోరాజా'
- బడ్జెట్ తగ్గించిన నిర్మాత
- షూటింగు ఆగిపోయిందని టాక్
ఈ సినిమా మేజర్ షెడ్యూల్ షూటింగు ఈ పాటికే మొదలుకావలసి వుంది. కానీ ఇంతవరకూ అందుకు సంబంధించిన సందడి ఎక్కడా కనిపించడం లేదు. నిర్మాతకీ .. రవితేజకి మధ్య తలెత్తిన విభేదాలే అందుకు కారణమనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ ను 40 కోట్ల నుంచి 30 కోట్లకి కుదించడం .. విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన కొన్ని సీన్స్ లేపేయమని ఆయన పట్టుబట్టడం రవితేజకి కోపం తెప్పించాయని అంటున్నారు. ఈ కారణంగానే షూటింగు ఆగిపోయిందని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.