టీటీడీ ఆర్జిత సేవా టికెట్లు విడుదల.. ఆగస్టు కోటా 67,737
- దేవస్థానం వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన అధికారులు
- ఆన్‌లైన్ లాటరీ విధానంలో 11,412 టికెట్లు
- సాధారణ పద్ధతి కోసం 56,325 టికెట్లు కేటాయింపు
ఆన్‌లైన్ లాటరీ విధానంలో కేటాయించే టికెట్లలో సుప్రభాత సేవకు 8,117, నిజపాద దర్శనానికి 2,875, అష్టదళ పద్మారాధనకు 180, తోమాల సేవకు 120, అర్చనకు120 టికెట్లు కేటాయించారు. ఇక సాధారణ పద్ధతి కోసం 56,325 టికెట్లను కేటాయించారు. ఇందులో దీపాలంకరణ సేవకు 15,600, వసంతోత్సవానికి 14,300, కల్యాణోత్సవానికి 13,300, ఆర్జిత బ్రహ్మోత్సవానికి 7,425, ఊంజల్ సేవకు 4,200 టికెట్లు, విశేషపూజకు 1,500 టికెట్లు కేటాయించారు. లాటరీ విధానంలో కేటాయించే టికెట్లు పొందేందుకు పేర్ల నమోదుకు నాలుగు రోజుల సమయం ఇచ్చారు. గడువు పూర్తయ్యాక లాటరీ తీసి టికెట్లు కేటాయిస్తారు.