ప్రియురాలు 'అన్నయ్యా' అనడంతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు!
- మోయినాబాద్ మండలంలో ఘటన
- బంధువుల అమ్మాయితో చనువుగా ఉన్న వెంకటేశ్
- ప్రేమ విషయం చెప్పేసరికి సోదరుడివంటూ షాకిచ్చిన యువతి
- స్నేహితులకు విషయం చెప్పి ఆత్మహత్య
ఇటీవల ప్రేమ విషయాన్ని అమ్మాయికి చెప్పగా, తనకు ప్రేమంటే ఇష్టం లేదని, నిన్ను కేవలం అన్నలా భావించానని వెంకటేశ్ కు చెప్పి షాకిచ్చింది. దీంతో మనస్తాపానికి గురైన వెంకటేశ్, గురువారం మధ్యాహ్నం గ్రామానికి సమీపంలో ఉన్న గండిపేట చెరువు వద్దకు వెళ్లి, ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పి, చనిపోతున్నానని అంటూ ఫోన్ పెట్టేశాడు. స్నేహితులు ఆందోళనతో చెరువు వద్దకు వెళ్లేసరికే ఆత్మహత్య చేసుకున్నాడు. చెరువులో గాలించి అతని మృతదేహాన్ని బయటకు తీయగా, విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.