అంజలి హారర్ థ్రిల్లర్ చిత్రంగా 'లిసా' .. విడుదల తేదీ ఖరారు
- అంజలి ప్రధాన పాత్రధారిగా 'లిసా'
- హారర్ నేపథ్యంలో సాగే కథ
- ఈ నెల 24వ తేదీన విడుదల
తాజాగా ఆమె 'లిసా' అనే మరో హారర్ థ్రిల్లర్ సినిమా చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ సినిమా, ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు .. తమిళ భాషల్లో ఇదే రోజున ఈ సినిమా విడుదల కానుంది. రాజు విశ్వనాథం దర్శకత్వం వహించిన ఈ సినిమా, తనకి తప్పకుండా మరో హిట్ ఇస్తుందనే నమ్మకంతో అంజలి వుంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.