ఆ అనుభూతిని వ్యక్తం చేయడానికి మాటలు ఉంటే బాగుండేది!: ‘జెర్సీ’పై అనుష్క
- సక్సెస్ టాక్‌తో నడుస్తున్న ‘జెర్సీ’
- క్రికెటర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న నాని
- ప్రశంసలు కురిపించిన అనుష్క
తాజాగా ప్రముఖ నటి అనుష్క సినిమాను చూసి తన అభిప్రాయాన్ని ఇన్‌స్టాగ్రాం ద్వారా పంచుకున్నారు. ‘‘జెర్సీ’ సినిమాలోని మ్యాచ్ చూసిన తర్వాత నేను పొందిన అనుభూతిని వ్యక్తం చేయడానికి మాటలు ఉంటే బాగుండేదనిపిస్తోంది. నిజంగా ఇది నాకు ఫ్యాన్ మూమెంట్ (ఇది కేవలం స్వచ్ఛమైన ప్రేమ). నాని, మిగిలిన చిత్ర బృందానికి శుభాకాంక్షలు. ఈ సినిమాను మాకిచ్చినందుకు ధన్యవాదాలు’ అని అనుష్క పోస్ట్ చేశారు.