తొమ్మిదేళ్లకే కొడుకు ప్రయోజకత్వం చూసి మురిసిపోతున్న తమిళ హీరో సూర్యా
- కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన దేవ్
- ఢిల్లీ చాంపియన్ షిప్ లో జయకేతనం
- కొడుకు ప్రతిభను ప్రత్యక్షంగా చూసిన సూర్యా, జ్యోతిక
ఈ కరాటే ఈవెంట్ లో ఒక్క తమిళనాడు నుంచే 40 మంది పోటీదారులు పాల్గొన్నా, దేవ్ తన ప్రతిభతో నిర్వాహకులను మెప్పించాడు. కుమారుడి ప్రతిభను ప్రత్యక్షంగా వీక్షించేందుకు టోర్నీ ఆసాంతం సూర్యా, జ్యోతిక ద్వయం వేదిక వద్దే గడిపింది. ఇక, దేవ్ టైటిల్ గెలవగానే సూర్యా ఆనందం అంతాఇంతా కాదు.