హిజ్రాగా నటించేందుకు ఒప్పుకున్న అమితాబ్ బచ్చన్!
- హిందీలో 'కాంచన' రీమేక్
- శరత్ కుమార్ పాత్రలో బిగ్ బీ!
- దర్శకత్వం వహించనున్న లారెన్స్
లారెన్స్ దర్శకత్వంలోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. లారెన్స్ పోషించిన పాత్రను అక్షయ్ కుమార్ పోషించనుండగా, ఆయనకు జోడీగా కైరా అద్వానీ నటిస్తోంది. ఇక సినిమాలో ఎంతో కీలకమైన హిజ్రా పాత్రలో నటించేందుకు అమితాబ్ అంగీకరించారని సమాచారం. తెలుగులో ఈ పాత్రను శరత్ కుమార్ పోషించారు. ఇక అమితాబ్ యాక్ట్ చేయడంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.