సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- యూరప్ షెడ్యూల్ కి పూజా హెగ్డే
- పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలకృష్ణ
- రకుల్ కి మరో రెండు ఆఫర్లు
* బాలకృష్ణ కథానాయకుడిగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తారని, అందులో ఆయన ఎస్పీ రంజిత్ కుమార్ రాణాగా కనిపిస్తారని తాజా సమాచారం.
* ప్రస్తుతం హిందీలో 'దే దే ప్యార్ దే' చిత్రాన్ని చేస్తున్న కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ కు అక్కడ మరో రెండు ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందే చిత్రం నుంచి, వరుణ్ ధావన్ హీరోగా నటించే ఇంకో చిత్రం నుంచి ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వచ్చాయట. ప్రస్తుతం వీటికి సంబంధించిన సంప్రదింపులు జరుగుతున్నాయి.