ఆది పినిశెట్టితో కీర్తి సురేశ్ సినిమా
- ‘మహానటి’ తరువాత నేరుగా నటించింది లేదు
- టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్న నగేశ్
- కీలక పాత్ర పోషిస్తున్న జగపతి బాబు
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నగేశ్ కుకునూర్ తొలిసారిగా టాలీవుడ్‌కు ఈ చిత్రం ద్వారానే పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి కథానాయకుడిగా కనిపించనుండగా, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వర్త్ ఎ షాట్ సంస్థ తొలిసారిగా నిర్మాణ సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చనున్నారు. స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పూణే పరిసరాల్లో అజ్రుగుతోంది.