'దృశ్యం' దర్శకుడితో కార్తీ సినిమా మొదలు
- కార్తీ తాజా చిత్రంగా రానున్న 'ఖైదీ'
- జీతూ జోసెఫ్ తో తదుపరి సినిమా
- లైన్లో 'రెమో' ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్
ఈ సినిమా తరువాత ఆయన 'దృశ్యం' ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ సినిమా షూటింగు ఈ రోజున మొదలైంది. వైవిధ్యభరితమైన ఈ సినిమాలో జ్యోతిక .. సత్యరాజ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా తరువాత 'రెమో' ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ ప్రాజెక్టును కార్తీ పట్టాలెక్కించనున్నాడు. మొత్తానికి కార్తీ ఈ ఏడాదంతా ఫుల్ బిజీగా వున్నాడన్న మాట.