'డియర్ కామ్రేడ్' ఆలస్యానికి అదే కారణమట
- 'డియర్ కామ్రేడ్' దర్శకుడిగా భరత్ కమ్మ
- రీ షూట్ కారణంగా ఆలస్యం
- మే 31వ తేదీన సినిమా విడుదల
ఈ సినిమా షూటింగ్ కాకినాడ .. తుని ప్రాంతాల్లో ఎక్కువగా జరిగింది. ఈ సినిమా రష్ చూసిన విజయ్ దేవరకొండ అసంతృప్తికి లోనయ్యాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. కొన్ని సీన్స్ రీ షూట్ చేయమని విజయ్ దేవరకొండ నిర్మాతలను కోరడం .. వాళ్లు చేయించడం జరిగిపోయిందని అంటున్నారు. ఈ కారణంగానే ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతూ వచ్చిందని చెబుతున్నారు. మే 31వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.