వెరైటీగా నాని తదుపరి సినిమా టైటిల్
- 'జెర్సీ'తో హిట్ కొట్టిన నాని
- తదుపరి సినిమా ఇంద్రగంటితో
- టైటిల్ గా 'వి' ఖరారు
ఈ సినిమాకి 'వ్యూహం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాకి 'వి' అనే టైటిల్ ను ఖరారు చేశారనే టాక్ వినిపిస్తోంది. 'వి' అనే అక్షరానికి, కథకి ఎలాంటి సంబంధముందనేది ఆసక్తిని కలిగించే విషయం. ఈ నెల 29వ తేదీన టైటిల్ లోగోతో కూడిన ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఆ రోజునే కథానాయికలకు సంబంధించిన విషయంలోను స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.